69వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌కు బెస్ట్ హీరో అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా అలియా భట్, ఉత్తమ స్టంట్ కొరియో గ్రాఫర్‌గా కింగ్ సాల్మన్, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ప్రేమరక్షిత్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా శ్రీనివాస మోహన్, ఉత్తమ గాయకుడు కాలభైరవ, ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి, ఉత్తమ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్, బెస్ట్ ఫిల్మ్‌క్రిటిక్ అవార్డ్ పురుషోత్తమాచార్యులు.