Building Collapse: మూడంతస్తుల భవనం కూలి 9 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన;
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో 9 మంది సజీవ సమాధి అయ్యారు. మీరట్‌లోని జాకీర్ కాలనీలో భవనం కూలిపోయింది. ఇప్పటివరకు 9 మంది చనిపోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం కురుస్తున్నప్పటికీ ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యాయి.
శిథిలాల కింద 14 మంది చిక్కుకుపోయారని జిల్లా కలెక్టర్ దీపక్ మీనా వెల్లడించారు. వారిలో ఎనిమిది మందిని రక్షించామన్నారు. మిగిలిగినవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగిందని తెలిపారు. కాగా, ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.