UK researchers: 3 నిమిషాల్లో కొవిడ్‌, క్యాన్సర్‌ గుర్తించే పరికరం-యూకే శాస్త్రవేత్తల అభివృద్ధి

Update: 2023-11-06 04:15 GMT

కొవిడ్‌, క్యాన్సర్‌ను 3 నిమిషాల్లో కచ్చితంగా గుర్తించే అత్యంత  చిన్నపాటి జన్యు పరీక్ష పరికరాన్ని యూకే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కొవిడ్‌ టెస్ట్‌’గా ఈ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌ ఇంజినీర్లు అభివర్ణించారు. ముక్కు ద్వారా సేకరించిన శాంపిల్‌ను ‘ల్యాబ్‌ ఆన్‌ ఏ చిప్‌’ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరం ద్వారా పరీక్షించి కొవిడ్‌ ఉందో లేదో నిర్ధారించవచ్చు. ఈ పరీక్ష ఫలితాన్ని స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌లో చూడవచ్చు. మురికి నీటిని ఈ పరికరంలో పరీక్షించి అందులో కొవిడ్‌ తదితర వ్యాధులను, ఇన్ఫెక్షన్లను వ్యాపింపచేసే వైరస్‌లను గుర్తించవచ్చు.

LoCKAmpను  UKలో రెండవ కోవిడ్ వేవ్ సమయంలో ను పరిశోధించడం,  అభివృద్ధి చేయడం ప్రారంభించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. LAMP  డిటెక్షన్ అనేది PCR టెస్టింగ్ కంటే ఎక్కువ సెన్సిటివిటీని కలిగి ఉండటం, వేగవంతమైనది మరియు మరింత నిర్దిష్టమైనది కాబట్టి  ఇది ఉత్తమమని ఈ శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. ముఖ్యంగా, PCR పరీక్షకు అవసరమైన మూడు థర్మల్ సైకిల్స్  కాకుండా, 65° ఒకే స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద దీనిలో  ప్రాసెసింగ్ జరుగుతుంది.అలాగే ఈ  పరికరాన్ని పోర్టబుల్ పరిమాణంలో మరియు తక్కువ విద్యుత్ వినియోగంతో సులభతరం చేయవచ్చు. 

Tags:    

Similar News