హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ రామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం మంచిర్యాలగా తెలుస్తోంది. రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న రామయ్య నాలుగున్నరేళ్లుగా మింట్ కాంపౌండ్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యింది. అయితే వెంటనే చికిత్స నిమిత్తం కేర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.