అత్త మామలపై కత్తితో దాడి చేసిన అల్లుడు
కుటుంబ కలహాలతో భార్య, అత్త, మామపై కత్తితో దాడి చేశాడు అల్లుడు చక్రపాణి.;
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరంలో ఓ అల్లుడు వీరంగం సృష్టించాడు. కుటుంబ కలహాలతో భార్య, అత్త, మామపై కత్తితో దాడి చేశాడు అల్లుడు చక్రపాణి. ముగ్గురిని చేతులపై నరికాడు. బాధితుల కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకునే లోపే చక్రపాణి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని స్థానికులు అంబులెన్స్‌లో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. భార్య, అత్త, మామపై దాడి చేసిన చక్రపాణి కోసం గాలిస్తున్నారు.