హైదరాబాద్‌లో మరో బెగ్గింగ్‌ ముఠా గుట్టురట్టు

Update: 2023-08-20 10:39 GMT

హైదరాబాద్‌లో మరో బెగ్గింగ్‌ ముఠా గుట్టురట్టయింది. అనాథ గృహాల ఫౌండేషన్ పేరుతో...కూడళ్ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట్‌ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో బెగ్గింగ్‌ ముఠా పట్టుబడింది. అమ్మ చేయూత ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన గణేష్‌, రవి, మంగు... ఇద్దరు ఏజెంట్లను నియమించుకొని వసూళ్లకు తెరలేపారు. అంతేగాకుండా సంస్థ నిర్వాహకులు సమాజ సేవ కోసం ఏడుగురు యువతులను నియమించుకొని ఫౌండేషన్‌ పేరిట డబ్బు వసూళ్లు చేయించారు. కలెక్షన్ బాక్సులను తయారు చేయించి.. వాటిని అద్దెకు ఇచ్చినట్టు గుర్తించారు.  

Tags:    

Similar News