Winter Session : ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం, డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంటు..

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు..

Update: 2025-11-25 05:00 GMT

 డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్‌ పార్టీ మీటింగ్‌  కు పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈనెల 30వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.

కాగా, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 1 నుంచి 19 వరకు కొనసాగనున్నాయి. ఈ మూడు వారాల సెషన్‌లో మొత్తం 15 సిట్టింగ్‌లు ఉంటాయి. ఈ సమావేశాలు కీలకమైన సమయంలో జరుగుతుండటం వల్ల చర్చలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా, 12 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) పై పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

Tags:    

Similar News