విమానశ్రయ మెట్రో ప్రాజెక్టు టెండర్ ఎల్ అండ్ టీ సంస్థకే ఖరారైనట్లు తెలుస్తోంది. రెండో దశకు గ్లోబల్ టెండర్లు పిలవగా ఎల్ అండ్ టీ లిమిటెడ్, ఎన్‌సీసీ లిమిటెడ్ మాత్రమే పోటీపడ్డాయి. గత నెల రోజులుగా మెట్రో అధికారులు, జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ కలిసి ప్రాజెక్టు అమలులో ఆ రెండు కంపెనీల అనుభవం, సాంకేతిక, ఆర్థిక నివేదికలు, పత్రాలను అధ్యయనం చేశారు. మెట్రో నిబంధనల్లో తొలిసారిగా పొందుపర్చిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌లో అనుభవం, అర్హత ఉన్న ఎల్ అండ్ టీకే టెండర్ ఖరారైనట్లు సమాచారం.