Al Falah University: ఫోర్జ‌రీ కేసులో అల్ ఫ‌లాహ యూనివ‌ర్సిటీ చైర్మెన్ అరెస్టు

Update: 2026-02-05 03:45 GMT

ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. అల్ ఫ‌లాహ్ యూనివ‌ర్సిటీ(Al Falah University) చైర్మెన్ జావెద్ అహ్మ‌ద్ సిద్ధికీని అరెస్టు చేశారు. చైర్మెన్ సిద్ధిక్‌పై యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద జ‌రిగిన పేలుళ్ల ఘ‌ట‌న త‌ర్వాత యూజీసీ ఆ ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ద‌ర్యాప్తు చేస్తున్న‌ది. ఫోర్జ‌రీ కోణంలో విచార‌ణ సాగుతున్న‌ది. అల్ ఫ‌లాహ్ యూనివ‌ర్సిటీలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, ఆ వ‌ర్సిటీ చైర్మెన్ ఫోర్జ‌రీకి పాల్ప‌డిన‌ట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సిద్ధిక్‌ని స్థానిక కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఆ కేసులో విచార‌ణ కోసం నాలుగు రోజుల క‌స్ట‌డీకి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మ‌రింత స‌మాచారం అందాల్సి ఉన్న‌ది.

Tags:    

Similar News