ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలోని భట్టుగూడెం గ్రామానికి నేడు వెళ్లనున్నారు. తన మామ, బీఆర్‌ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం వద్ద నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఆయన ప్రారంభించనున్నారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి భట్టుగూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఈ ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ఆధునిక వసతులతో కూడిన 1000 మందికి సరిపడే ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవానికి తన అల్లుడైన అల్లు అర్జున్‌తోపాటు మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆయన ఆహ్వానించారు.