మోదీని ఎదుర్కొనే సత్తా రాహుల్‌కే ఉంది- గిడుగు రుద్రరాజు
రాహుల్‌ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని మండిపడిన గిడుగు రుద్రరాజు;
దేశ రాజకీయాల్లో మోదీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేత రాహుల్‌గాంధీయేనని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. పార్లమెంట్‌లో రాహుల్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందుకే ఆయన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, RSS కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.