Cyclone Ditwah: ద్వీప దేశం శ్రీలంకను కుదిపేసిన దిత్వా తుఫాన్‌

486 మంది మృతి

Update: 2025-12-05 04:30 GMT

దిత్వా తుఫాన్‌ ద్వీప దేశం శ్రీలంకను కుదిపేసింది. తుఫాను బీభత్సానికి కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కడికక్కడ వరదలు సంభవించాయి. ఇళ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక పట్టణాలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. దిత్వా తుఫాను బీభత్సానికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. నవంబర్‌ 16 నుంచి ఇప్పటి వరకూ 486 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 341 మంది ఆచూకీ గల్లంతయింది. ఈ సంక్షోభ సమయంలో భారత దేశం శ్రీలంకకు అండగా నిలుస్తోంది. ‘ఆపరేషన్‌ సాగర్‌ బంధు’ పేరుతో మానవతా సాయాన్ని అందజేస్తోంది. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), భారత వాయు సేన ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి.

Tags:    

Similar News