JP Nadda: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌తో నడ్డా భేటీ

Update: 2023-06-25 11:37 GMT

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్‌లో పలువురు ప్రముఖులను కలిశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌తో నడ్డా సమావేశమయ్యారు. టోలిచౌకిలోని ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇంటికి స్వయంగా వెళ్లిన నడ్డా ప్రత్యేకంగా అరగంటపాటు సమావేశమయ్యారు. నడ్డా వెంట కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు నాయకులున్నారు. బీజేపీ 9 ఏళ్ల పాలనలో సాధించిన పురోగతి, తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారంపై రూపొందించిన పుస్తకాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు అందజేశారు నడ్డా.

Tags:    

Similar News