BRS: భూపాలపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగ

Update: 2023-08-20 07:54 GMT

అధికార బీఆర్ఎస్‌ పార్టీ హైకమాండ్‌కు మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఇప్పటికే జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టికెట్ గొడవ జరుగుతుంటే.. ఇప్పుడు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్‌ విషయం కూడా రచ్చకెక్కింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారులు పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News