బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ దక్కని నేతలు అధిష్టానాన్ని టార్గెట్ చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. వేముల విరేశం, భేతి సుభాష్ రెడ్డి తోపాటు బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కంటోన్మెంట్ టిక్కెట్ ఆశించిన క్రిశాంక్ కూడా సందిగ్ధంలో ఉన్నారు. మెదక్ నుంచి టికెట్ ఆశించిన మైనంపల్లి రోహిత్ కూడా బంగపడ్డారు. ఇక మల్కాజ్‌గిరి టికెట్ ఇచ్చినా మైనంపల్లి హనుమంతురావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.