ఏపీలో భూముల ధరలు తగ్గడానికి జగన్ అసమర్థ పాలనే కారణమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. అమలాపురంలో ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు . ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందన్న ఆయన మేధావులు కూడా మాట్లాడేందుకు భయ పడుతున్నారని అన్నారు., తెలంగాణలో భూములు ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో ఎకరం భూమి వంద కోట్లు పలుకుతోందని,అప్పట్లో కోకాపేటకు ఫార్ములా వన్ రేసింగ్ తీసుకురావాలనుకున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌కు బ్రాండింగ్ తేవాలను కునుకుంటే..ఫార్ములా వన్ రేసింగ్‌కు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడ్డాడని అన్నారు.