అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. భవిష్యత్‌కు గ్యారెంటీ చైతన్య యాత్రలో భాగంగా ఈ పర్యటన చేస్తున్నారు. ఈ చైతన్య యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.ఇవాళ అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్‌లో వైద్యులు, న్యాయవాదులు, రైతులు, బ్రాహ్మణ సమైక్య, పాస్టర్‌లతో పాటు ఆయా వర్గాల నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.