హైదరాబాద్‌లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది.మియాపూర్ పీఎస్ పరిధిలోని వసంత విల్లాస్‌లో చోరీచేసి బంగారం ఎత్తుకెళ్లారు. తాళం వేసిన విల్లాలపై కన్నేసిన చెడ్డీ గ్యాంగ్ పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడింది. రెండు రోజుల క్రితం ఘటనలు జరిగినా విషయాన్ని గోప్యంగా ఉంచారు పోలీసులు. చోరీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు.చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. దాదాపు 30తులాల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు.