CI Transfer : డిప్యూటీ సీఎం కార్యాలయంలో సీఐ దురుసు ప్రవర్తన
అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఐ ప్రయత్నం.. బదిలీ వేటు;
తాజాగా ఏపీలో ఓ సీఐ పై బదిలీ వేటు పడింది. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఉన్న సమయంలో ఓ సీఐ అనుమతి లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. సిఐ లోపలికి వెళ్లే సమయంలో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ భద్రత సిబ్బంది ఆ సిఐ కి లోపలికి వెళ్లేందుకు కొద్దిసేపు ఆగాలని చెప్పారు. అయితే వారి మాటలను లెక్క చేయని సిఐ భద్రత సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
ఆపై సీఐ లోపల పూజకు కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే షూ తోనే లోపలికి వెళ్ళాడు. ఈ సంఘటనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది పోలీస్ ఉన్నాదికారులకు సీఐ దురుసు ప్రవర్తనను తెలియజేశారు. దీంతో బుధవారం నాడు సీఐ శ్రీనివాసరావుపై బదిలి వేటు వేశారు అధికారులు.
ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్‌కుమార్‌ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. సీఐ శ్రీనివాసరావు గతంలో జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది నివసించే అపార్టుమెంట్‌లోకి వెళ్లి తనిఖీల పేరిట హడావుడి చేశారు. అప్పట్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి.