Hollywood: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త వివాదాలు
వేతనాల సవరణ కోసం హాలీవుడ్ రైటర్స్ సమ్మె;
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సి హాలీవుడ్‌లో కొత్త వివాదాలకు దారి తీస్తోంది. ఇప్పటికే వేతనాల సవరణ కోసం హాలీవుడ్ రైటర్స్ సమ్మె చేస్తున్నారు. అయితే ప్రస్తుతం లక్షా 60 వేల మంది యాక్టర్లు సభ్యులుగా ఉన్న సాగ్ ఆఫ్ట్రా యూనియన్ సమ్మె నోటీసు ఇచ్చింది. వేతనాలను సవరించడంతో పాటు ఏఐతో ఏర్పడే ఇబ్బందుల నుంచి తమకు రక్షణ కూడా కల్పించాలని నటీ నటులు డిమాండ్ చేస్తున్నారు. యాక్టర్లతో చర్చలకు తాము సిద్ధమేనని వాల్ డిస్నీతో పాటు నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంపెనీలు పేర్కొన్నాయి.