ఏపీ సీఎం జగన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైరయ్యారు. జగన్ సీఎంగా ఉండగా పోలవరం పూర్తి కాదని విమర్శించారు. ఒక్కొక్క బాధితుడికి 10 లక్షలు ఇస్తానన్నారు కానీ.. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదన్నారు. గతంలో తానే పూర్తి చేస్తానన్న జగన్.. ఇప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటున్నారన్నారు. 2025 నాటికి పూర్తి చేస్తామంటూ గడువు పెంచారని.. అయితే 2025 నాటికి జగన్ సీఎంగా ఉండరన్నారు. నిర్వాసితుల్ని నీళ్లలో ముంచి మాట మారుస్తున్నారని మండిపడ్డారు.