ఎన్టీఆర్‌ జిల్లా లో భారీగా పంటనష్టం

Update: 2023-07-29 08:15 GMT

ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ నుంచి భారీగా వరదనీరు ఉమ్మడి కృష్ణా జిల్లాను ముంచెత్తుతుంది. దీంతో ఎన్టీఆర్‌ జిల్లా లో భారీగా పంటనష్టం ఏర్పడింది.నందిగామ మండలంలో దాదాపు 700 ఎకరాల్లో పంట దెబ్బతింది.మున్నేరు పరివాహక ప్రాంతంలో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో మోటార్లు,పైపులు దెబ్బతిన్నాయి. పూర్తిగా మట్టి మేటవేసింది. ఎకరాకు 25 వేల రూపాయల ఖర్చు పెట్టిన రైతులు.. మళ్లీ తమ చేలను బాగుచేసుకునేందుకు అదనపు ఖర్చు చేయాలని ఆందోళనలో ఉన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోని, సాయం చేయాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News