Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో విచిత్ర వాతావరణం..
తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న వాయు కాలుష్యం..
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండగా, వాయు కాలుష్యం మాత్రం క్రమంగా పెరుగుతోంది. నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్‌లా మారింది. దేశ రాజధానిలో AQI 400 పాయింట్లు దాటింది. కొన్ని హాట్ స్పాట్లలో 500 పాయింట్ల వరకు నమోదైంది. ఇక ఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనూ విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. నగరంలో కాలుష్యం పెరగడంతో అధికారులు గ్రేడ్–4 చర్యలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో హైబ్రిడ్ (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్) విధానంలో క్లాస్ లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, మిగతా సగం మంది ఇంటి నుంచి పని చేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.