తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు.. కిషన్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో 2023 ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.. తన నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని గెలిపించుకుంటానని చెప్పారు. సంజయ్‌కి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు.. ఇద్దరం సోదరులుగా కలిసి పనిచేశామని ధర్మపురి అర్వింద్ చెప్పారు.