హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలోని ఓ గోడౌన్‌లో ఔషధ నియంత్రణ అధికారులు సోదాలు నిర్వహించారు. లేబుల్స్ లేని మందులు, గడువు ముగిసిన మందులను భారీగా నిల్వ చేసినట్లు గుర్తించారు. 50 లక్షల విలువైన స్టాక్‌ను సీజ్ చేసి ఉమేష్ బాబులాల్ అనే వ్యక్తిని ఎల్‌బీ నగర్ ఎస్‌వోటి పోలీసులకు అప్పగించారు. ఐదు సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా దందా జరుగుతోంది. గడువు ముగిసిన రా మెటీరియల్‌ను ఎక్కడికి పంపిస్తున్నారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.