తానా సభలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
సైకోలే జాత్యహంకారపు, కులహంకారపు ఆలోచనలు చేస్తారు - ఎన్వీ రమణ;
తానా సభలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. మానసిక పరిస్థితి సరిగా లేనివాళ్లే జాత్యాహంకారపు, కులహంకారపు ఆలోచనలు చేస్తారని అలాంటి ఆలోచనలనే వ్యాప్తిలోకి తెస్తారని అన్నరు. ఇలాంటి మానసిక పరిస్థితి ఉన్నవాళ్లే విచ్ఛన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారని, కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. తాను తన కుటుంబం తప్ప ఇలాంటి వారికి ఇంకేవి పట్టవన్నారు. ఇలాంటి వారి ప్రచారాన్ని నమ్మి వినాశానానికి ఊతమిస్తామంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవన్నారు ఎన్వీ రమణ.