నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. తనను చంపేందుకు కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లుగా పార్టీలో ఎన్నో బాధలు భరించానన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై చేసిన వ్యాఖ్యలను తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. నకిరేకల్ అభివృద్ధిపై చిరుమర్తి బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసి రారు. తమ పార్టీల్లో చేరమని కాంగ్రెస్, బీజేపీ నుంచి పిలుపు వచ్చిన మాట వాస్తవమేనన్నారు వేముల వీరేశం. అనుచరులు, కార్యకర్తల ఇష్టం మేరకే పార్టీ మార్పు అని వెల్లడించారు.