Constable : మాజీ కానిస్టేబుల్ ఇంట్లో కోట్లులో ఆస్తులు
14 కోట్ల నగదు, 40 కోట్ల విలువైన పసిడి;
మధ్యప్రదేశ్ రవాణా శాఖకు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ నివాసాలలో సోదాలు జరిపిన వివిధ దర్యాప్తు సంస్థలకు దాదాపు రూ.14 కోట్ల నగదు, రూ.40 కోట్ల విలువైన బంగారం, రూ.2 కోట్ల విలువైన వెండి,రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సంబంధించిన అనేక పత్రాలు లభించాయి. మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంటిపై గత వారం లోకాయుక్త మొదటిసారి దాడి జరపగా రూ. 2.87 కోట్ల నగదు, 275 గ్రాముల వెండితోసహా రూ.7.98 కోట్ల చరాస్తులు లభించాయి. ఆదాయ పన్ను శాఖ మరోసారి దాడి జరపగా రూ.40 కోట్ల విలువైన 52 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.11 కోట్లకు పైగా నగదు భోపాల్‌లో ఒక నిర్జన ప్రదేశంలో వదిలివేసిన కారులో లభించాయి.