హైదరాబాద్ మియాపూర్‌లో కాల్పులు సంచలనం రేపాయి. మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్ పై రాత్రి రిత్విక్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దేశవాళీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దేవేందర్‌కు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. వివాహేతర సంబంధమే కాల్పులకు కారణమని అనుమానిస్తున్నారు.