హైదరాబాద్‌లో టికెట్ల కోసం కాంగ్రెస్ నేతల సిగపట్లు
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా..;
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ టికెట్‌పై కన్నేసిన అజారుద్దీన్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా..ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆయన్ని అడ్డుకున్నారు విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు. మరోవైపు ముషీరాబాద్‌లో అంజన్‌కుమార్ వర్సెస్ సంగిశెట్టి జగదీశ్వరరావు అన్నట్లు ఉంది పరిస్ధితి. ఈసారి టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు సంగిశెట్టి. అటు సనత్‌నగర్ టికెట్ రేసులో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి ఉండగా సనత్‌నగర్ టికెట్ తనకే అంటున్నారు కోటా నీలిమ. గోషామహల్ టికెట్‌పైనా నేతల హోరాహోరీ ప్రచారాలు చేసుకుంటున్నారు.