Hyderabad: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో రూ.712 కోట్ల మోసం
టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా మోసాలు: సీవీ ఆనంద్;
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా 712 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆన్‌లైన్‌లో టాస్క్‌ల పేరుతో మొదట డబ్బులిచ్చి తర్వాత ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాక మోసం చేస్తున్నారని వెల్లడించారు. చైనా, దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న ఈ స్కామ్‌లో.. అమాయకులే కాకుండా ఐటీ ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని సీవీ ఆనంద్ చెప్పారు.