హైదరాబాద్ కిమ్స్ సన్‌షైన్ హాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. దేశంలోనే తొలిసాగిగా నానోస్కోప్ టెక్నాలజీ ద్వారా, భుజం స్పోర్ట్ సర్జరీల్లో నూతన విప్లవానికి మార్పు తీసుకొచ్చారు వైద్యులు. నానో స్కోపీతో కత్తిగాటు, కట్టు లేకుండా నీడీల్ షోల్డర్ సర్జరీ చేస్తారు. నొప్పిచాలా తక్కువగా ఉండడంతో, రోజూవారీ కార్యక్రమాలకు ఇబ్బందులు ఉండవన్నారు కిమ్స్ సన్‌షైన్ మేనేజింగ్ డైరెక్టర్ గురవారెడ్డి. నానో స్కోప్ షోల్డర్ స్పోర్ట్ సర్జరీలో, విప్లవాత్మకమైన మార్పుకు ఈ విధానం నాంది పలుకుతుందన్నారు గురవారెడ్డి.