ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో సాయుధ దాడి జరిగింది. సుప్రీంకోర్టు ఆవరణలో ఇద్దరు జడ్జీలను కాల్చిచంపారు. మొహమ్మద్ మొగిషు, హోజతొలెస్లామ్ అలీ రైజిని అనే జడ్జీలు మృతిచెందారు. దాడిలో గాయపడ్డ మరో జడ్జికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. షూటింగ్‌కు పాల్పడిన తర్వాత దుండగుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి చెందిన మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉన్నది.