INS Kolkata: ముంబైకి చేరిన ఐఎన్ఎస్ కోల్‌కతా
పోలీసులకు 35 మంది సముద్రపు దొంగలు అప్పగింత;
సోమాలియా తీరంలో సముద్రపు దొంగలతో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించింది. అరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్ నేవీ ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15న అరేబియా సముద్రంలో పైరేట్ల నౌక ఎక్స్-ఎంవీ రూయెన్‌ను అడ్డగించిన భారత నౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతా 40 గంటల ఆపరేషన్ అనంతరం 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్‌ఎస్ కోల్‌కతాకు సాయంగా ఐఎన్‌ఎస్ సుభద్ర, భారత వాయుసేన కూడా రంగంలోకి దిగి ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. 35 మంది పైరేట్లతో అక్కడి నుంచి బయలుదేరిన నౌక ఈ ఉదయం ముంబై తీరం చేరుకుంది.