కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించారు. బెయిల్ అంశం తమ పరిధిలో లేదని న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఎన్‌ఐఏ కోర్టు సూచించింది. గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదికి ఆదేశాలు ఇచ్చింది. అనంతరం విచారణను ఈనెల 11కు కోర్టు వాయిదా వేసింది.