జగన్ పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్. జగన్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమేనని.. చేతల ప్రభుత్వం కాదన్నారు. రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడినా చంద్రబాబు మనుషులంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ పెళ్లి కానుక, విదేశీ విద్య లాంటి పథకాలను అటకెక్కించారని.. గత మూడేళ్లలో ఎంత మందికి సాయం చేశారో చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.