గోదావరి జిల్లాల్లో వారాహి జోరు
ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని వారాహి జోరు కొనసాగుతోంది. రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు.;
ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనాని వారాహి జోరు కొనసాగుతోంది. రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్‌లో పవన్ కళ్యాణ్ విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, ఎన్‌జీవో ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం జనవాణి కార్యక్రమంలో భాగంగా స్థానిక సమస్యలు, ఇబ్బందులపై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఆ తర్వాత వీర మహిళా విభాగంతో పవన్ సమావేశం కానున్నారు. సాయంత్రం చేబ్రోలు చేనేత కార్మికులతోనూ సమావేశం కానున్నారు.