తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు.కాంగ్రెస్‌పై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని..కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్సేనన్నారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఉచిత కరెంట్‌ను వ్యతిరేకించిన వ్యక్తి కేసీఆర్ అని.. డబ్బుల కోసం మధ్యం టెండర్లు 3 నెలల ముందే వేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.