తెలంగాణలో 24 గంటల కరెంటు రావడం లేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా 12 గంటలకు మించి కరెంటు ఎక్కువ ఇవ్వడం లేదన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కరెంటు కోతలు తప్పవని ఇప్పటికే నీరందక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం మాటలు నమ్మి నాట్లు వేసిన రైతులు నిండా మునిగే ప్రమాదం ఏర్పడిందన్నారు. రైతుబంధు డబ్బులు రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదన్నారు. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.