మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలిచిన కేటీఆర్
ఇదేనా వారికిచ్చే గౌరవం అంటూ మండి పడ్డారు;
రెజ్లర్లకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధ్యతగల నాయకులెవరైనా ఈ ఘటనకు సమాధానం చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. రెజ్లర్ల అరెస్ట్‌లను ఖండిస్తూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. రెజ్లర్ల అరెస్ట్‌పై నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రపంచ వేదికపై దేశానికి కీర్తి తెచ్చిన ఛాంపియన్లకు మద్దతివ్వాలని, వారిని గౌరవించాలని ట్వీట్ చేశారు. రెజ్లర్ల అరెస్ట్‌ని, వారి నిరసనపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించారు.