అవినాశ్ రెడ్డి అనుచరులు రికార్డు స్థాయిలో తాగేశారట
కర్నూలులో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు;
కర్నూలులో రికార్డ్ స్థాయిలో మద్యంలో అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లో అవినాష్ రెడ్డి అనుచరులు తెగ తాగేస్తున్నారని వైన్ షాపు యజమానులు అంటున్నారు. ఈ మేరకు కేవలం మూడు రోజుల్లో 23 వైన్ షాపుల్లో రూ. 3.14 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. విశ్వభారతి హాస్పటల్ దగ్గరల్లోని వైన్ షాపులో మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. తమ కార్లనే మొబైల్ బార్లుగా మార్చుకుని మరీ తాగేశారని తెలుస్తోంది.