అతిపెద్ద భూ దోపిడికి ఎంపీ విజయసాయిరెడ్డి ప్లాన్‌ !

Update: 2023-08-21 09:02 GMT

విశాఖలో వైసీపీ పెద్దల భూ దాహంపై మండిపడుతున్నారు స్థానికులు తర్లుపాడు గ్రామంలోని కోట్ల విలువైన భూమిని కారుచౌకగా ప్రభుత్వం నుంచి పొందేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారన్న నేపధ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తర్లువాడ కొండపై ప్రసిద్ధ విష్ణుపాదాలు, దేవాలయం ఉందని వరాహ నరసింహ స్వామి మొదట ఇక్కడే వెలసి ఆ తర్వాత అడవివరం కొండపైకి వెళ్లినట్లు స్థానికులు అంటున్నారు. చారిత్రాత్మక నేపధ్యం ఉన్న ఈ విలువైన భూమి విజయసాయిరెడ్డికి కట్టబెడుతుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రైవేట్‌ వ్యక్తులు ఈ స్థలం ఆక్రమించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.  

Tags:    

Similar News