పల్నాడు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది.ప్రతి గ్రామాల్లో మహిళలు, యువత లోకేష్‌ను స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు టీడీపీ సీనియర్ నేత యరపతనేని శ్రీనివాస రావు. రేపు పిడుగురాళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, వేయి మంది మహిళలు బోనాలతో స్వాగతం పలకనున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశామని తెలిపారు. 5వేల మంది యువకులు యువగళం టీ షర్టులతో లోకేష్‌కు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.