మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలనాలు బయటికి వస్తున్నాయి. సినిమా ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీకి డ్రగ్ మాఫియాతో లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్‌లతో వెంకట్, బాలాజీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్ పార్టీ జరిగిన రూమ్‌లో 5 రకాల మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. LSD, ESTACY పిల్స్, MDMA , కొకైన్, గాంజా స్వాధీనం చేసుకున్నారు. ఇన్ని రకలా డ్రగ్స్ ఉండటం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.