Madhya Pradesh: 45 ఏళ్ల నాటి చోరీ కేసులో వృద్ధుడి అరెస్టు

100 కేజీల గోధుమలు దొంగిలించినట్లు అభియోగం

Update: 2026-02-09 00:30 GMT

 ఒక వృద్ధుడు 45 ఏండ్ల క్రితం తాను చేసిన దొంగతనాన్ని మరచిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే చట్టం మాత్రం ఆ కేసును జ్ఞాపకం పెట్టుకొని తాజాగా అతడిని అరెస్ట్‌ చేసింది. పోలీస్‌ అధికారి శ్వేతా శుక్లా కథనం ప్రకారం.. సలీమ్‌, మరో ఆరుగురు కలిసి 1980లో బల్సాముంద్‌ కాకడ్‌ ప్రాంతంలోని పొలాల నుంచి రూ.100 విలువైన గోధుమలను దొంగిలించారు. ఆ తర్వాత సలీమ్‌ పక్కనే ఉన్న ధార్‌ జిల్లాలోని బాగ్‌ పట్టణానికి పారిపోయి అక్కడ ఒక కిరాణా దుకాణం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. సలీమ్‌పై వారెంట్‌ ఉండటంతో ఈ దొంగతనం కేసు కోర్టులో అలాగే పెండింగ్‌లో ఉంది. ఇటీవల మరో నిందితుడి కోసం సైబర్‌ విభాగం గాలిస్తుండగా సలీమ్‌ ఆచూకీ తెలిసింది.

Tags:    

Similar News