Earthquake : మయన్మార్‌లో భూకంపం..

అస్సాం, మణిపూర్‌, నాగాలాండ్‌లో ప్రకంపణలు

Update: 2025-09-30 03:30 GMT

మయన్మార్‌లో భారత సరిహద్దుల వెంబడి స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.7గా నమోదయింది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు 27 కిలోమీటర్ల దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంతో ఆ రాష్ట్రంతోపాటు నాగాలాండ్‌, అస్సాంలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 15 కిలోమీట్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మొలజీ (NCS) తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది.

కాగా, సోమవారం అర్ధరాత్రి 12.09 గంటల సమయంలో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.4గా ఉందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. ఇక టిబెట్‌లో కూడా మంగళవారం ఉదయం భూకంపం వచ్చింది. ఉదయం 4.28 గంటలకు 3.3 తీవ్రత ప్రకంపణలు వచ్చాయి. అస్సాంలోని దిబ్రూగఢ్‌కు 303 కిలోమీటర్లు, అరుణచల్‌ ప్రదేశ్‌లోని పంగిన్‌కు 227 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నదని పేర్కొంది.

Tags:    

Similar News