ఢిల్లీలో దారుణం
16ఏళ్ల బాలికను 20 సార్లు కత్తిపోట్లకు గురిచేసిన ఉన్మాది;
16ఏళ్ల ఓ బాలికను ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఢిల్లీలోని షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, సోమవారానికల్లా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని సాక్షి(16)గా గుర్తించారు. దాదాపు ఇరవై సార్లు నిందితుడు సాక్షిని కత్తితో పొడిచినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది.