"కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక"

నిన్న ధరణి తీసేస్తం అన్నాడని.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడంటూ విరుచుకుపడ్డారు.;

Update: 2023-07-12 08:08 GMT

కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నాడని.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడంటూ విరుచుకుపడ్డారు. మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అన్నారు.   చిన్నకారు రైతంటే కాంగ్రెస్ కు చిన్నచూపని సన్నకారు రైతు అంటే సవతిప్రేమ అని ఆరోపించారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమని అన్నారు. 

Tags:    

Similar News