హైదరాబాద్ కాచిగూడ తిలక్‌నగర్‌లో....రమ్య అనే మైనర్ బాలిక అదృశ్యమైంది. రెండురోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక... తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తిలక్‌నగర్ ఫివర్‌ఆస్పతి మార్గంలో బాలిక నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజ్ లభ్యమైంది.ఇక బాలిక తండ్రి తిలక్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. రమ్య అంబర్‌పేట పోలీస్‌లైన్లోని జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి...దర్యాప్తు చేస్తున్నారు.