Telangana: రైతులకు ప్రభుత్వం ఎంతో గౌరవం తెచ్చిందది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సదాశివనగర్ మండలం పద్మాజివాడలో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న కవిత;
రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో గౌరవం తెచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సదాశివనగర్ మండలం పద్మాజివాడలో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న కవిత... ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూశామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామని.. దీంతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. ఇక కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. వరిసాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు కవిత.